ఈ పదం ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఎవరి నోట విన్నా వినబడుతుంది. ప్రముఖ దర్శకులు సైతం కథలు లేకపోవడంతో కకావికలవుతున్నారు. తాజా ఉదాహరణగా బి.గోపాల్, బాలయ్య కాంబినేషన్‌లో ఏడాదినాడు ప్రారంభమైన సినిమాకు ఇప్పటికీ సరయిన కథ కుదరలేదట. ఎంతోమంది రచయితలు కథలు చెప్పినా... ఇది అలా ఉంది.. అది ఇలా ఉందంటూ... వెనుకడుగు వేస్తున్నారు. అందుకే కొంతమంది ఈ గొడవ ఎందుకని హాలీవుడ్, పరభాషా చిత్రాలను చూసి కథ రాసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం కొత్త డీవీడీలు కోసం పలు షాపుల్లో దర్శకుల టీమ్ వేట మొదలుపెట్టింది. దీనికి కారణం ఉంది. గతంలో చాలా హిట్ చిత్రాలు డీవీడీల్లోనివే. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఒకప్పడు 'అంజి' సినిమా తీశాడు. ఆ తర్వాత అంత రేంజ్‌లో మరో చిత్రాన్ని చేయాలని 'అరుంధతి' తీశాడు. ఇప్పుడు మరలా కొత్త ప్రయోగం కోసం విదేశాల్లో తన ఫ్రెండ్స్ చేత కొత్త డీవీడీలు కావాలని చెబుతున్నారు. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అంజి సినిమా స్పీల్‌బర్గ్ 'ఇండియాన జోన్స్ అండ్ క్రిస్టర్‌స్కల్' సినిమాకు కాపీనే. మమ్మీ సినిమాను మార్చి అరుంథతి తీశారు.
ఆ తర్వాత మహేష్ నటించిన దూకుడు చిత్రం కూడా 'ద లెజెండ్ ఆఫ్ ద ఫీస్ట్' చిత్రాన్ని చాలా మటుకు వాడుకున్నారు. మగధీర సరేసరి... గ్లాడియేటర్, ట్రాయ్, 300 యోధులు చిత్రాలన్నీకాపీ చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంటాయి. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న 'ఈగ' కూడా 'ద ఫ్లయ్' అనే హాలీవుడ్ చిత్రానికి మూలం అంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్న యువదర్శకులు హాలీవుడ్ చిత్రాలను చూసి నిర్మాతల్ని టెంప్ట్ చేస్తున్నారు. కాపీ నుంచి క్రియేటివిటీకి ఎప్పుడు సానబెడతారో మరి..!!
Post a Comment