.
Home » » ‘గబ్బర్‌ సింగ్’ ఆడియో ఒకేసారి మూడు నగరాల్లో..?

‘గబ్బర్‌ సింగ్’ ఆడియో ఒకేసారి మూడు నగరాల్లో..?

Written By Hot nd spicy on Tuesday, 13 March 2012 | 10:53

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్ సింగ్’ ఆడియో ప్రయోగాత్మకంగా ఒకేసారి మూడు నగరాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 7వ తేదీన ఈచిత్రం ఆడియో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలలో ఆడియో వేడుక జరుపాలని... ఒక చోట దర్శకుడు, మరొక చోట నిర్మాత, ఇంకొక చోట పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సినిమాపై అంచనాలు పెంచడంలో భాగంగానే ఇంత గ్రాండ్ గా విడుదలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

చిత్రాన్ని మే 9 న విడుదల చేసేందుకు నిర్మాత గణేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనపించనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే మాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే చిత్రానికి కమిట్ అయ్యారు. పవర్ స్టార్ మేనరిజానికి సరిపోయే ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger