ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో అందిస్తున్న 'త్రీ ఇడియట్స్'డబ్బింగ్ 'స్నేహితుడు'ఆడియోకు అమీర్ ఖాన్ గెస్ట్ గా వస్తున్నాడు.స్నేహితుడు చిత్ర గీతాల్ని ఈ నెల 19న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. శిల్పకళా వేదికలో ఈ ఆడియో పంక్షన్ ఘనంగా జరుగుతుంది. అమీర్ కూడా శంకర్ చేసిన రీమేక్‌పై ప్రత్యేక దృష్టి నిలిపారు. రామ్‌చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హారీస్ జైరాజ్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 26న చిత్రం విడుదలవుతుంది.
ఈ కార్యక్రమానికి 'త్రీ ఇడియట్స్'హీరో అమీర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరవుతూండటంతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. హిందీలో విజయవంతమైన 'త్రీ ఇడియట్స్'ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'నన్బన్' పేరుతో తమిళంలో తెరకెక్కింది. దీన్ని తెలుగులో 'స్నేహితుడు' పేరుతో అనువదించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించింది. విజయ్, ఇలియానా జంటగా నటించారు. జీవా, శ్రీరామ్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో ఈ చిత్రం రికార్డులు బ్రద్దలు కొడుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు.

Post a Comment