తొక్కలో ‘ఈగ’ కదా అని తేలిగ్గా తీసుకోవద్దు, దాని యజమాని రాజమౌళి...అందుకే అది చాలా డేంజరస్ అంటున్నారు సినిమా విశ్లేషకులు. రాజమౌళి డైరెక్షన్ స్టామినా అలాంటిదిమరి. ఇప్పటి వరకు కెరీర్లో అపజయం అంటే ఏమిటో తెలియని రాజమౌళి ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు తన బ్రాండ్ సినిమాకు ఉన్న రేంజ్ ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్న రాజమౌళి ఈ సినిమాను తెలుగు సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూలేని విధంగా అధ్భుతమైన విజువల్ ఎఫెక్టులతో హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందు కోసం విదేశీ సాంకేతిక నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నాడు ఈ దర్శకుడు.
ఇటీవల విడుదలైన ఈగ వాల్ పోస్టర్ చూసిన చాలా మంది....గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయంటున్నారు. మరి రాజమౌళి దర్శకత్వంలో ఆరేంజ్ సినిమా తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పుతుందా...ప్రస్తుతం పరిశ్రమలో సాగుతున్న మూస లవ్ స్టోరీలు, రింవేజ్ స్టోరీలకు భిన్నంగా ఈ సినిమా ఉటుందా? లేక ఇలాంటి తరహా కథల్లోనే రాజమౌళి కొత్తదనం చూపించబోతున్నాడా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇప్పటి వరకు తెలిసిన ‘ఈగ’ సినిమా స్టోరీ ప్రకారం...సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ ఈగ. మరణించిన హీరో ఈగ రూపంలో జన్మించి రివేంజ్ తీర్చుకుంటాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, తెలుగు సినిమా రంగంలో ఎలాంటి మార్పులు తేబోతోంది? అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. ఈ చిత్రంలో నాని, సమంత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Post a Comment