పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పద్మాలయాలో స్పెషల్ గా వేసిన టీవీ ఛానెల్ సెట్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సెట్ మీదకు పవన్ తో పాటు ఆయన కుమారుడు అకిర నందన్ రావటం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రక్క సెట్స్ లో షూటింగ్ జరుగుతున్న వారు కూడా వచ్చి అకిరానందన్ ని చూసి పోతున్నారు.
సెట్స్ కి వచ్చిన అకిరా అక్కడ ఉన్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ని,మిగతా నటీనటులతో కలిసిపోయారు. వాళ్లతో చాలా సేపు ఇంట్రాక్ట్ అయ్యారు. సెట్స్ లో ఉత్సాహంగా తిరుగుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ సరదాగా గడిపిన విషయం యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. అకీరా గతంలో కూడా తీన్ మార్ షూటింగ్ లో కర్ణాటక,కొలాకతా సెట్స్ కు వచ్చేవారు. అలాగే పంజా ఆడియో పంక్షన్ కి వచ్చి తన తండ్రి ప్రక్కనే కూర్చున్నారు.
ఇక ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు.
అలాగే 'గబ్బర్‌సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. వచ్చే అక్టోబర్ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
Share with Friends : |
Share with Friends : |
Post a Comment