మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మలుపు తప్పిన చిత్రం ‘ఖైదీ'. అప్పట్లో ఆ చిత్రం ఓ సంచలన విజయం సాధించింది. తాజాగా ఆచిత్రం రీమేక్ జరుగుతోందని, దాంట్లో ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు తగిన ఆధారాలు మాత్రం లభించ లేదు.
తాజాగా ఇందుకు సంబంధించిన ఓ బలమైన ఆదారం లభించింది. ఇటీవల ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ అయిన సినిమా పేర్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ‘ఖైదీ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించింది. దీన్ని బట్టి ఆ సంస్థ రామ్ చరణ్ హీరోగా ఆచిత్రాన్ని రూపొందించే ప్లాన్లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఎందుకంటే అంత పవర్ ఫుల్ టైటిల్‌కి మెగా వారసుడిగా రామ్ చరణ్ తప్ప ఎవరూ సెట్ కారనేది కొత్తగా చెప్పక్కర్లేదు. పైగా తన తండ్రి పాటలను చరణ్ సినిమాల్లో రీమిక్స్ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. అదే విధంగా ‘ఖైదీ' సినిమా రీమేక్ రామ్ చరణ్‌తో మంచి ఫలితాలు వస్తాయనే వాదన వినిపిస్తోంది.
ఇక ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ అయిన ఇతర టైటిళ్లను పరిశీలిస్తే...
రామకృష్ణ సినీ స్టూడియోస్ వారు ‘ఎన్టీఆర్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇది బాలయ్య హీరోగా ప్లాన్ చేస్తున్న సినిమా అని టాక్. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తానాన్ని బేసుకుని బాలయ్య తన రాజకీయ భవిష్యత్‌కు ఈచిత్రాన్ని వాడుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్న పూర్ణ స్టూడియోస్ వారు ‘భాయ్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇందులో నాగార్జున నటించనున్నాడు.

మామ 3, అల్లుడు 6(సౌభాగ్య మీడియా ప్రై.లి)
పితృదేవోభవ (తారక ప్రభు ఫిల్మ్స్)
మాస్ రాజా(ఎస్.వి.కె. సినిమా)
రవితేజ చెడుగుడు (క్రాంతి కృష్ణ ఆర్ట్స్)
విజేత (వి.ఎం.సి కంబైన్స్)
డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ(ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్)
లక్ష్మినారాయణ ఐపిఎస్ (ఆండాల్ ఆర్ట్స్)

Share with Friends : |
Share with Friends : |
Post a Comment