టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ఫోటోలు ఇటీవల నెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి దగ్గరి నుంచి అన్నా హజారే దాకా ఎవరినీ వదిలి పెట్టడం లేదు ఆయన అభిమానులు. కొత్త సినిమాలు పోస్టర్ రిలీజ్ కాగానే దానికి బ్రహ్మీ మొహం తగిలించి మార్ఫింగ్ చేసి ఫన్నీ టైటిల్స్ పెడుతుంటారు. ఇలా ఆ సందర్భం ఈ సందర్భం అని తేడా లేకుండా బ్రహ్మానందం మార్ఫింగ్ ఫోటోలతో ఆటలాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఫేస్‌బుక్‌లో ఓ మేసేజ్ పాస్ చేశారు. ‘ఫేస్ బుక్ మెంబర్స్‌కి నా అభ్యర్థన...మీరు నామీద ఎన్ని జోకులయినా వేసుకోండి...కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి...నాకేం బాధ లేదు...ఎందుకంటే నేను పుట్టిందే మిమ్మల్ని నవ్వించడానికి...కానీ నా పేరు పెట్టుకుని ఇతరులను మాత్రం దయచేసి అవమానించకండి...అది నన్ను తీవ్రంగా బాధిస్తోంది...నేను ఎప్పుడూ అలా కోరుకోను...నా అభ్యర్థనను పెద్ద మనసుతో ఆలకిస్తారని భావిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు.
బ్రహ్మానందం అభ్యర్థనకు మరింత ప్రచారం కల్పించడంలో భాగంగా దర్శకుడు రాజమౌళి....దాన్ని తన ఫేస్‌బుక్ ద్వారా ప్రమోషన్ కల్పించారు. ఆ మెసేజ్‍ను ఫాలోకండి అంటూ దాన్ని అందరికీ షేర్ చేశారు. మరి బ్రహ్మానందం అభ్యర్థను, రాజమౌళి కోరికను ఎంతమంది పాలో అవుతారో?
Share with Friends : |
Share with Friends : |
Post a Comment