మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్టుండి డిలీట్ అయిన విషయం తెలిసిందే. 2 లక్షల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ట్విట్టర్ నుంచి వైదొలగడంతో అభిమానుల్లో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. చరణ్ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ వెనక ఒక బలమైన కారణం వినిపిస్తోంది.
మెగా కుటుంబ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం చరణ్ కావాలనే ట్విట్టర్ నుంచి తప్పుకున్నాడని, తన స్టార్ ఇమేజ్‌ను పెంచుకోవడంలో భాగంగానే చరణ్ ఈ చర్యకు పూనుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నందున తరచూ అభిమానులకు, మీడియాకు అందుబాటులో ఉండకుండా అప్పడప్పుడు మాత్రమే కనిపిస్తుండటం వల్ల హైప్ పెరుగుతుందని, ఈ విషయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను ఫాలో కావాలని చెర్రీ నిర్ణయించుకున్నాడని అంటున్నారు. జంజీర్ చిత్రం ద్వారా చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పబ్లిసిటీ పెంచుకోవడానికి ప్రత్యేకంగా మేనేజర్లను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే మరో వార్త కూడా ఫిల్మ్ నగర్లో చెక్కర్లు కొడుతోంది. ట్విట్టర్లో తన భార్య ఉపాసనపై కొందరు భరించలేని కామెంట్స్ చేస్తుండటం వల్లనే రామ్ చరణ్ ట్విట్టర్‌కు స్విస్తి చెప్పాడని అంటున్నారు. కారణం ఏదైనా అభిమానులకు మాత్రం చరణ్ ట్విట్టర్ నుంచి వైదొలగాడన్న వార్త మింగుడు పడటం లేదు.
ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ ‘జంజీర్' షూటింగులోపాల్గొంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ‘జంజీర్' చిత్రాన్ని అదే పేరుతో మళ్లీ రీమేక్ చేస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment