సనా ఖాన్... ఆమధ్య వ్యభిచారం కేసులో ప్రచారంలోకి వచ్చిన సినీ నటి. ఈ నిషా ఖాన్ టాలీవుడ్ హీరోయిన్లు మందు కొట్టడం, దమ్ము పీకటం గురించి నోరు విప్పిందట. మందు కొట్టడం గురించి కొంతమంది టాలీవుడ్ హీరోయిన్లు చెప్పే పత్తిత్తు మాటలు చూస్తే తనకు నవ్వు వస్తోందని అంటోందట.
టాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది చాటుమాటుగా పూటుగా మందుకొడతారని చెపుతోందట. అంతేకాదు... ఘాటైన బ్రాండు సిగరెట్టును గుప్పుగుప్పుమంటూ పీల్చేవారూ ఉన్నారని అంటోందట. కాకపోతే వీళ్లంతా చాటుమాటుగా తాగుతుండటం వల్ల వారి పేర్లు బయటకు రావడం లేదని చెపుతోందట.
అదే బాలీవుడ్ హీరోయిన్లు నిర్భయంగా బయటే రెస్టారెంట్లలో మందు కొట్టడం చేస్తుంటారనీ, కారులో అలా వెళుతూనే సిగరెట్టు కాల్చి పారేస్తుంటారని చెపుతోందట. ఇంతకీ మందు, దమ్ము కొట్టే హీరోయిన్లు టాలీవుడ్‌లో ఎవరూ...? అని అంటే మాత్రం... తనూ దమ్ము కొడుతూ అలా ఓ లుక్కేసిందట.
Post a Comment