ఇన్నాళ్లుగా తనకి షెల్టర్ ఇచ్చి,తనని ఇంతటి వాడిని చేసిన చెన్నైకి రజనీకాంత్ త్వరలో బై చెప్పనున్నారు. ఆయన చెన్నై విడిచిపెట్టి కోయంబత్తూరు షిప్ట్ అయిపోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కోయంబత్తూర్‌లో ‘అనైకట్టి'లో ఓ ఇల్లు కట్టిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇంటి నిర్మాణం జరుగుతున్న సమీపంలో స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఉందని సమాచారం. ప్రశాంతమైన జీవితం గడపాలనే ఆలోచనతోనే ఆ ఆశ్రమం దగ్గర రజనీ ఇల్లు కట్టించుకుంటున్నారనే చెప్పుకుంటున్నారు.
ఇక రజనీ స్థిర నివాసం కోయంబత్తూర్‌లోనే అని తెలిసి అక్కడి అభిమానులు ఆనందపడుతున్నారు. రజనీకి ఘనస్వాగతం పలకడానికి సిద్ధపడుతున్నారు. అలాగే రజనీ కట్టిస్తున్న ఇల్లు అక్కడివారికి ఓ ‘పిక్నిక్ స్పాట్'లా అయ్యింది. అక్కడి స్థానికులు వింతను చూస్తున్నట్లు ఈ ఇంటి నిర్మాణాన్ని తిలకిస్తున్నారు. రజనీ తమకు దగ్గరగా రావడం కోయంబత్తూర్‌వాసులను ఆనందపరిస్తే చెన్నయ్‌వాసులు మాత్రం సూపర్ స్టార్ తమకు దూరమవుతారేమోనని బాధపడుతున్నారు.
ఇక తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న ‘కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్‌కి ‘విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారనేది విశ్వసనీయ సమాచారం. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
రజనీకాంత్ చిత్రం గురించి మాట్లాడుతూ...''ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాశక్తి, మైమింగ్ అవసరముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాదు. మోషన్ టెక్నాలజీతో షాట్స్ తీయడం ఒక సవాల్ ... ఇదొక టఫ్ జాబ్ అన్నారు. అలాగే ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్' ఒక విందులాంటిదని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. రజనీకాంత్, శరత్‌కుమార్, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment