తమిళ దర్శకుడు శంకర్ తర్వాతి చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఆయన చేసిన ప్రతి చిత్రానికి వెనుక టెక్నికల్‌గా, కథాపరంగా మంచి టీమ్ ఉంటుంది. ఓ సైంటిస్ట్ ఆయన చిత్రాలకు తగిన సలహాలు, సూచనలు ఇస్తాడని తెలిసిందే. అందుకే ఒక్కో చిత్రం ఒక్కో అద్భుతమైన సినిమాగా శంకర్ తీర్చిదిద్దాడు. ఈసారి జాతీయ సమస్యను టార్గెట్ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే చిత్రాన్ని తీయాలని కంకణం కట్టుకున్నారట శంకర్.
ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలు ఎన్నికలు, పార్టీలు మారటాలు, కుంభకోణాలు, ఓటుకు నోటు, రాజీనామాలు, మళ్లీ ఎన్నికలు నిర్వహించడం... వంటి ఎన్నో అంశాలను టచ్ చేస్తూ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో అపరిచితుడు విక్రమ్ హీరోగా నటించనున్నాడట. పనిలోపనిగా ఎ.ఆర్.రెహమాన్ కూడా శంకర్ దగ్గర చేరినట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో విక్రమ్ చేత అద్భుతమైన ప్రయోగాలు చేయిస్తాడని తెలిసింది. కొన్ని రకాల గెటప్స్ ఆయన పోషించనున్నారు. హీరోయిన్‌గా సమంత నటించనుంది. మరో హీరోయిన్ కూడా చేయనుంది. ఈ చిత్రం తమిళ, తెలుగులోనే కాక హిందీలో కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు సాగుతున్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ ఈచిత్రాన్ని నిర్మించడానికి ముందుకువచ్చింది.
Post a Comment