నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ఆయన వారసులు నాగార్జున, నాగచైతన్య కలిసి ఓకే సినిమాలో నటించబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని ఆ మధ్య వార్తలొచ్చినా ఆయన చెప్పిన కథ, స్క్రీన్ ప్లే నచ్చక పోవడంతో నాగార్జున తిరస్కరించారని ఆ మధ్య ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
తాజాగా ఈచిత్రం ‘ఇష్క్’ చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే విక్రమ్ కుమార్ నాగార్జునను కలిసి కథ వివరించాడని, నాగార్జునకు స్టోరీ నచ్చిందని...పూర్తి స్క్రిప్టు తయీరు చేసుకుని తనను కలవమని చెప్పాడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది.
ప్రస్తుతం నాగార్జున నటించిన ‘డమరుకం’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. జులైనెలలో ఈచిత్రం విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ దాదాపుగా రూ. 40 కోట్లతో దీన్ని నిర్మించారు ఆర్ ఆర్ మూవీమేకర్స్ వారు. నాగార్జునకు ఉన్న మార్కెట్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో చిత్రాన్ని లాభాల్లో అమ్ముకోవడానికి నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాతలు చెప్పిన రేటుకి కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
మరో వైపు నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘షిరిడి సాయి’ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ భక్తిరస చిత్రాలు వచ్చాయి. ఆ సినిమాల్లో భక్తుడిగా కనిపించిన నాగ్ ఇందులో తొలిసరి దేవుడుగా నటిస్తున్నాడు. డమరుకం విడుదల తర్వాత ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment