స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం జూన్ 12న ఈచిత్రం లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఇది తొలి సినిమా. యాక్షన్ అండ్ డ్రామా నేపథ్యంలో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు.
ఈచిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించనున్నారు. అల్లు అర్జున్‌కు సూటయ్యే టాప్ హీరోయిన్‌ను ఇందులో తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. గతంలో కిక్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఏ రేంజిలో తీస్తారో అని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘జులాయి’చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియాన నటిస్తోంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
‘జులాయి’ చిత్రం దాసరి చేతుల్లోకి వెళ్లి పోయింది. ఈచిత్రానికి సంబంధించిన ఏపీ థియేట్రికల్ రైట్స్ దాసరికి సంబంధించిన ‘సిరి మీడియా’ భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: రాధాకృష్ణ, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పకులు: డి వివి దానయ్య.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment