Home »
Gossips
» శ్రుతి హాసన్ అక్కడ టూటూ వేసుకున్న తర్వాత "సుడి" తిరిగిందట
శ్రుతి హాసన్ అక్కడ టూటూ వేసుకున్న తర్వాత "సుడి" తిరిగిందట
గబ్బర్ సింగ్ చిత్రంలో తాజా ఆపిల్ పండులా కనిపించి ప్రేక్షకులను ఊరించిన శ్రుతి హాసన్ లేటెస్ట్ హిట్ తో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో బిగ్ కంపెనీల రిబ్బన్ కటింగ్‌లకు హాజరవుతూ తెగ బిజీగా ఉంది. ఇపుడు శ్రుతి హాసన్ లెగ్ గోల్డెన్ లెగ్ అంటూ సినిమా వాళ్లే కాదు కంపెనీల వాళ్లు కూడా ఆమె వెనకాలే తిరుగుతున్నారట. అదలావుంచితే శ్రుతి హాసన్‌కు ఉన్నట్లుండి గబ్బర్ సింగ్‌తో సుడి తిరగడానికి కారణం వేరొకటి ఉన్నదని చెపుతున్నారు టాలీవుడ్ సినీజనం. ఆమధ్య శ్రుతిహాసన్ టాలీవుడ్‌లో ఎడాపెడా ఒంటిపై టాటూలేసుకుని కనిపించే హీరోయిన్‌తో అలా కొద్దిసేపు ముచ్చటించిందట. ఎన్ని సినిమాల్లో నటించినా హిట్ రాలేదని తెగ ఫీలయిపోయిందట. దాంతో సదరు టాటూ హీరోయిన్ ఓ టాటూ చిట్కా చెప్పిందట.దాంతో శ్రుతి హాసన్ వేరే ఆలోచన చేయకుండా వెంటనే టాటూను ఆమె సూచించిన చోట అంటించుకున్నదట. గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ ప్రారంభం దగ్గర్నుంచి విడుదలయ్యే వరకూ ఆ టాటూను ఎడమ చేతి మణికట్టుకు కింద అంటించుకుని తిరిగిందట. అంతే.. గబ్బర్ సింగ్ విడుదలవడం.. శ్రుతి హాసన్ సుడి తిరగడం చకచకా జరిగిపోయాయంటున్నారు. లక్కీ టాటూ అన్నమాట.
Post a Comment