స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘జులాయి’ చిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. జూన్ 10న ఈచిత్రం ఆడియో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన గత సినిమా ఖలేజా మాదిరి చిత్రాన్ని లేట్ చేయకుండా అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఈచిత్రాన్ని త్వరిత గతిని పూర్తి చేస్తున్నారు. జూన్ 21 లేదా 22న ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. రాధాకృష్ణ ఈచిత్రాన్ని హారిక హాసిని ప్రొడక్షన్స్ బేనర్ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పకులు.
ఇక ఈ చిత్రం హైలెట్స్ విషయానికొస్తే... ''అర్జున్ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం ‘జులాయి’ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. .జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందనేది సినిమా కథాంశం.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ కాంబినేషన్లో...వరుసగా ఆర్య, బన్నీ, పరుగు, ఆర్య 2 లాంటి వరుస చిత్రాలు వచ్చాయి. దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి దేవిశ్రీ పని చేసిన జల్సా చిత్రం మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. జులాయి చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక ఈ చిత్రం హైలెట్స్ విషయానికొస్తే... ''అర్జున్ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం ‘జులాయి’ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. .జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందనేది సినిమా కథాంశం.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment