పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ, ఇలియాన హీరో హీరోయిన్లుగా ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో ఈచిత్రానికి సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయగా... తాజాగా రవితేజ, ఇలియానాతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం పూరి జగన్నాథ్ స్టయిల్‌లో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్ ఉంటుందని స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం హీరో, హీరోయిన్లు రవితేజ, ఇలియానాలపై ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు చకచకా జరిగి పోతున్నాయి. ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ మొత్తం పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ జరుగాల్సి జరుగుతోంది.
గతంలో పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇక రవితేజ, ఇలియాన మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అనడానికి 'కిక్' సినిమానే నిదర్శనం. ఈనేపథ్యంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం మంచి ఎంటర్‌టైనర్ గా నిలుస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి.
ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అదిస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఆడియో విడుదల చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జులై నెలలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హీరో, హీరోయిన్లు రవితేజ, ఇలియానాలపై ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు చకచకా జరిగి పోతున్నాయి. ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ మొత్తం పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ జరుగాల్సి జరుగుతోంది.
గతంలో పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇక రవితేజ, ఇలియాన మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అనడానికి 'కిక్' సినిమానే నిదర్శనం. ఈనేపథ్యంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం మంచి ఎంటర్‌టైనర్ గా నిలుస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment