తమిళంలో 'చిన్న కుష్బూ'గా పేరుపొందిన హన్సిక ఈ మధ్యన బాగా సన్నబడ్డ సంగతి తెలిసిందే. దాంతో హన్సిక మళ్లీ స్టార్ హీరోల సరసన సినిమాలు సంపాదిస్తోంది. తాజాగా ఆమె తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఎంపికైంది. సింగమ్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రంలో ఈమెను ఎంపిక చేసారు. హన్సిక ఈ సినిమాలో కాలేజ్ గర్ల్‌గా కనిపించన్నుది. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం ఒకేసారి విడుదల చేయటనికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సూర్య, అనుష్క జంటగా నటించిన 'సింగమ్' ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో 'యముడు' పేరుతో విడుదలై ఇక్కడా సక్సెసయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు హరి. హన్సికకి తెలుగు,తమిళ మార్కెట్లు రెండూ ఉండటంతో ఆమెను ఎంపిక చేసారు. తద్వారా బిజినెస్ బాగుంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం హన్సిక..నాగచైతన్య సరసన త్వరలో నటించబోతోందని సమాచారం. నాగచైతన్య, సునీల్ కలిసి చేయబోతున్న వెట్టై రీమేక్ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెను ఎంపిక చేసారు. సునీల్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట సాగుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని రూపొందించిన డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. తమిళంలో లింగు స్వామి డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. యాక్షన్,ఎంటర్టనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అవడం గమనార్హం. 'మాప్పిళ్లై', 'ఎంగేయుమ్ కాదల్', 'వేలాయుధం', 'ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాలతో ఆమె తమిళంలో టాప్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది. 'సింగమ్ 2' సినిమా తన పాపులారిటీని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ సుందరి. కాగా ఒరిజినల్‌కి సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకీ బాణీలు కూర్చబోతున్నాడు.
ఇక సూర్య, అనుష్క జంటగా నటించిన 'సింగమ్' ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో 'యముడు' పేరుతో విడుదలై ఇక్కడా సక్సెసయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు హరి. హన్సికకి తెలుగు,తమిళ మార్కెట్లు రెండూ ఉండటంతో ఆమెను ఎంపిక చేసారు. తద్వారా బిజినెస్ బాగుంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం హన్సిక..నాగచైతన్య సరసన త్వరలో నటించబోతోందని సమాచారం. నాగచైతన్య, సునీల్ కలిసి చేయబోతున్న వెట్టై రీమేక్ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెను ఎంపిక చేసారు. సునీల్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట సాగుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని రూపొందించిన డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. తమిళంలో లింగు స్వామి డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. యాక్షన్,ఎంటర్టనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment