ఆదివారం రాత్రి జరిగిన జులాయి ఆడియో విడుదల కార్యక్రమాన్ని చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొగడ్తలకు ఎక్కువ అల్లు అర్జున్ జులాయి ఆడియో విడుదలకు తక్కువ అన్నట్లు ఉంది. స్టేజిపైకి ఎక్కి మైకు అందుకున్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
చెప్పాలంటే.. మెగా అభిమానుల్లో పవన్ కు అంత క్రేజ్ రావడానికి కారణం.. అతడు సగటు జీవి హృదయాన్ని తాకగలగడమేననీ పవన్ సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్ అంటూ ఎత్తేసిన నాగబాబు చిరంజీవి గురించి మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
ఇక అల్లు అర్జున్ అయితే తను ఒక ఈర్ష్యాళువుననీ, ఎదుటి హీరో సినిమా బాక్సీఫీసు వద్ద బోర్లా పడితే, భలే జరిగిందని అనుకునేవాడనని చెప్పుకొచ్చారు. ఒకరోజు అలా ఖుషీ అవుతుంటే బాబాయి పిలిచి అది మంచిది కాదనీ, మనం తీసిన సినిమా టప్ మని పేలిపోతే మనం ఎంత బాధపడతామో అతడు కూడా అలాగే బాధపడతాడని చెప్పారు.
ఆ మాటలకు అర్థం అప్పుడు తెలియకపోయినా ఇప్పడు బాగా అర్థమవుతోందని చెప్పుకొచ్చారు. ఇలా ఎవరికివారు పవన్ కళ్యాణ్‌కు డప్పు కొట్టడాన్ని చూస్తుంటే తదుపరి మెగాస్టార్ స్థానాన్ని పవన్ కళ్యాణ్ కు కట్టబెడతారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment