.
Home » » బాలకృష్ణ సరసన అనూష్క ఖరారు...!?

బాలకృష్ణ సరసన అనూష్క ఖరారు...!?

Written By Hot nd spicy on Monday, 28 May 2012 | 10:39

అనూష్క,బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక్క మగాడు తర్వాత సినిమాలు ఇప్పటివరకూ రాలేదు. అయితే అభిమానులుకు ఆ ఆనందం త్వరలో దక్కనుంది.
బాలకృష్ణ హీరోగా ఆనాటి సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నుండి ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఇక సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ చిత్రం హాలీవుడ్ స్థాయి కథాంశంతో అలనాడే తెలుగు పరిక్షిశమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10న వెలువడనున్నట్లు సినీ వర్గాల సమాచారం. 1991లో విడుదలైన ‘ఆదిత్య 369’ విమర్శకులు ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయగా బాలకృష్ణ అద్భుతాభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇళయరాజా స్వరకల్పనలోని పాటలన్నీ బహూళ ప్రజాదరణ పొందాయి.


అలాగే అనూష్క ప్రస్తుతం తమిళంలో చేస్తున్న చిత్రం బృందావనంలో నందకుమారుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. అనూష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇరాండం ఉలగం టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుంది. ఇందులోని ఓ పాత్ర కోసం అనూష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇందులో రాధిక ఓ కీలకపాత్రను పోషిస్తోంది. తమిళంలో ఈ చిత్రాన్ని యూ.టీవి మోషన్ పిక్చర్స్ వారు సమర్పిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రసాద్ .వి.పొట్లూరి అందిస్తున్నారు. ఇందులో అనూష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ రేంజిలో ఈ చిత్రం అద్బుతంగా రూపొందుతోందని చెన్నై వర్గాల టాక్.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger