.
Home » , » మిలియన్ డాలర్ల క్లబ్‌లో ‘గబ్బర్ సింగ్’

మిలియన్ డాలర్ల క్లబ్‌లో ‘గబ్బర్ సింగ్’

Written By Hot nd spicy on Monday, 28 May 2012 | 10:36

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఓవర్సీస్‌లో బాక్సాఫీసును దడదడలాడిస్తోంది. తాజాగా ఈచిత్రం యూఎస్ బాక్సాఫీసులో 1మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతంలో ఈమార్కును దాటిన ఒకే ఒక్క సినిమా ‘మగధీర’ చిత్రం మాత్రమే. సాధారణం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఓవర్సీస్ యూఎస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్లు వసూలు చేసే సత్తా ఉందనే అభిప్రాయం ఉండేది. తాజాగా తెలుగు సినిమాలు కూడా తన సత్తా చాటుతుండటం గమనార్హం.

 యూఎస్‌లో ఈచిత్రాన్ని బ్లూస్కై సంస్థ విడుదల చేసింది. మా సంస్థ ద్వారా విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును దాటడం ఆనందంగా ఉందని, మగధీర చిత్రం తర్వాత ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో సెకండ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

గబ్బర్ సింగ్ చిత్రం ఊపు చూస్తుంటే ఈ ప్రభంజనం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో అర్థం కావడం లేదని నిర్మాతలు అంటున్నారు. ఈచిత్రం ఇప్పటికే లెక్కకు మిక్కిలి వసూళ్లూ సాధిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం నిర్మాతలకు విపరీతమైన లాభాలను తెచ్చి పెడుతోంది.

పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అభిమన్యు సింగ్చ, కోట శ్రీనివాస్, నానినీడు, అజయ్, సుహాసిని, బ్రహ్మానందం, అలీ తదితరులు ఈచిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger