.
Home » » రామ్ చరణ్ - అల్లు అర్జున్ "ఎవడు"కోసం భారీ సెట్

రామ్ చరణ్ - అల్లు అర్జున్ "ఎవడు"కోసం భారీ సెట్

Written By Hot nd spicy on Monday, 28 May 2012 | 10:42

లేటెస్ట్‌గా రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎవడు'. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే జంజీర్‌ రీమేక్‌లో ముంబైలో షూటింగ్‌ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ వచ్చాడు రామ్ చరణ్.

ఎవడు షూటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. సమంతా కాంబినేషన్‌లో సాగే ఓ పాటను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. దీనికి 70 లక్షలు ఖర్చు చేశారు. ఓ మాస్‌ సాంగ్‌ కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న డౌట్‌ రావచ్చు.

ఈ చిత్రంతో పాటు మరో సినిమా దిల్‌రాజుది ఉంది. అది కూడా ఇక్కడే తీయనున్నారు. కాగా, ఇందులో శ్వేతా భరద్వాజ్‌ అనే హీరోయిన్‌తో ఐటం సాంగ్‌ కూడా చేశారు. దీన్నికూడా అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రించారు.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger