తనీష్ హీరోగా వచ్చిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత ఆ తర్వాత సిద్దార్థ హీరోగా వచ్చిన ‘బావ’ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈరెండు చిత్రాలు ప్లాపు కావడంతో ప్రణీతకు ఇక్కడ అవకాశాలు ఇచ్చే వారే కరవుయ్యారు.
ఆ తర్వాత తన మాతృభాష కన్నడ, తమిళంలో ఒకటి అర సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న ప్రణీతా తాజాగా తమిళ స్టార్ హీరో కార్తి సరసన శకుని చిత్రంలో అవకాశం దక్కించుకుంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఇంతకీ ఈ సినిమాకు ప్రణీత పుచ్చుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా..? కేవలం రూ. 5 లక్షలు మాత్రమేనట. ఈ సినిమానే కాదు గత సినిమాలకు కూడా అమ్మడు తీసుకుంది ఇంతే నట.
ప్రస్తుతం శకుని చిత్రం రూపొందుతున్న బేనర్‌పైనే మరో చిత్రాన్ని కూడా రూ. 5 లక్షలకే ఒప్పుకుందని తమిళ సినీ వర్గాల సమాచారం. కోట్ల రూపాయలు తీసుకుంటున్న హీరోయిన్ రేంజికి ఎదగాలని అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా తన ఖర్చుల సరిపడా రెమ్యూనరేషన్ మాత్రమే పుచ్చుకుంటూ పాపం తెగ కష్ట పడుతోంది ప్రణీత.
ఎన్.శంకర్‌దయాళ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘శకుని’ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. స్టూడియోగ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పకుడు. జి.వి.ప్రకాష్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను జూన్ 1న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment