రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఈగ’ వాయిదా మీద వాయిదా పడుతూ వెలుతోంది. గతంలోనే ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా మే 30కి వాదా పడింది. అనంతరం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదనే కారణంలో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ చివరి వారంలో ఈచిత్రం విడుదలవుతుందని భావించినా....అప్పుటిక కూడా సినిమా విడుదల సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. బహుషా జులై నెలలో ఈచిత్రాన్ని రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.
నాని, సమంత, సుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ ఎత్తున క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈగ’ చిత్రం విడుదలకు ముందు స్టోరీ మొత్తం చెప్పేసిన దర్శకుడు రాజమౌళి....తన డైరెక్షన్ సత్తాను చాటుకున్నాడు. ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.
సినిమా మొత్తం ఇద్దరు ప్రేమికులు, ఈగ చుట్టూ తిరుగుతుంది. అందువల్ల సినిమాలో అశ్లీల సన్నివేశాలు గానీ, భారీ హింసాత్మక సంఘటనలు గానీ ఉండే అవకాశాలు లేవు. పైగా ఈగ చేసే విన్యాసాలు చిన్న పిల్లలను కూడా అలరించే విధంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి క్లీన్ యూ సర్టిపికెట్ రావడం ఖాయమని భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment