.
Home » » 'ఎన్టీఆర్' జీవితంపై ప్రముఖ దర్శకుడు సినిమా

'ఎన్టీఆర్' జీవితంపై ప్రముఖ దర్శకుడు సినిమా

Written By Hot nd spicy on Thursday, 31 May 2012 | 10:21

జన హృదయ నేత ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిచటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగు దేశం కి చెందిన కొందరు ముఖ్యనేతలు ఈ చిత్రాన్ని నిర్మించటానికి ఆసక్తి చూపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకి ఈ చిత్రం దర్శకత్వం నిర్ణయించినట్లుగా పిల్మ్ సర్కిల్సో లో వినికిడి. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించే అవకాశముంటుందని చెప్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ యువకుడుగా ఉన్న ఎపిసోడ్స్ ని జూ.ఎన్టీఆర్ తోనూ, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం వంటి ఎపిసోడ్స్ ని బాలకృష్ణతోనూ చేయించాలని ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు బాలకృష్ణకు చెప్పటం జరిగిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా ఓ వార్త ప్రయణం చేస్తోంది. అయితే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ సినిమాలో ఉంటుందా ఉండదా అనేది మాత్రం సస్పెన్స్ అంటున్నారు.

ప్రస్తుతం రాఘవేంద్రరావు'శిరిడి సాయి' జీవిత చరిత్ర ను తెరకెక్కిస్తున్నారు. నాగార్జున కీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులుమనాలిలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నాగార్జునపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం విషేషాలు నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిస్తున్నారు. ఇటీవలే కర్ణాటకలో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది''అన్నారు.

సమత, మమత, ప్రేమ... లాంటి మానవతా భావనల గురించి జనావళికి చెప్పిన అవధూత షిర్డీ సాయిబాబా. 'ఆత్మవత్‌ సర్వభూతాని' అనే భగవద్గీత తత్వాన్ని చూపించి... మానవ రూపంలో ఉన్న దైవంగా భక్తుల పూజలందుకొన్నారు. బాబా బోధనలు, మహాత్మ్యాల్ని తెరపైకి తీసుకొస్తున్నారు కె.రాఘవేంద్రరావు. నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''వాసనలు వేరైనా, వర్ణాలు ఎన్నయినా పూలన్నీ ఒక్కటే. ప్రతి పువ్వు పూజించడానికి అర్హమైనదే అనేది సాయిబాబా ప్రబోధం. కులమతాలను త్యజిద్దాం, మనుషులంతా ఒక్కటే అనేది ఆ మాటల్లో అంతర్లీనంగా ఉన్న సత్యం. పరమాత్ముడు ఎక్కడో లేడు, పసిపాప మనసున్న ప్రతి వ్యక్తిలోనూ దేవుడున్నాడని బోధించారాయన.

సాయి జీవనశైలి, ఆయన ఆధ్యాత్మిక చింతన యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. సాయి పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోయారు. కీరవాణి సంగీతం మరింత బలం తీసుకొచ్చింద''న్నారు. సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్‌, సంగీతం: కీరవాణి.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger