బ్రహ్మానందం ఏ పాత్ర చేసినా కామెడీకి లోటు ఉండదు. తాజాగా బ్రహ్మానందం విద్యా బాలన్ అనే పాత్రను పోషిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు 'దరువు'. రవితేజ, తాప్సీకాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర నవ్వులు పూయిస్తుందని చెప్తున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఆడియో విడుదలయ్యింది. తొలి సీడీని నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. నటి, శాసనసభ్యురాలు జయసుధ అందుకొన్నారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాత. విజయ్ ఆంథోనీ స్వరాలు సమకూర్చారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ...ఇందులో డ్యాన్స్‌మాస్టర్‌గా నటించాను. పేరు విద్యాబాలన్. ఆ పాత్రలో పండే వినోదం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు.'దేవుడు చేసిన మనుషులు' చిత్రీకరణలో భాగంగా బ్యాంకాక్‌లో ఉన్న రవితేజ, పూరి జగన్నాథ్ ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు చెప్పారు. అక్కడ ఉన్న రవితేజ, పూరి జగన్నాథ్ ‘వీడియో కాన్ఫరెన్స్’ ద్వారా ‘దరువు’ ఆడియో వేడుకలో పాల్గొన్నవారిని పలకరించారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు రవితేజ సమాధానాలు చెప్పారు.
రవితేజ మాట్లాడుతూ..''నా సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. యాక్షన్, వినోదం, గెటప్పులు... ఇలా అన్ని విషయాల్లోనూ దరువు వినిపించేలా ఉంటుంది ఈ చిత్రం . శివతో నాకిది మొదటి సినిమా. ఫెంటాస్టిక్ డెరైక్టర్. సినిమా బాగా వచ్చింది. శివరామకృష్ణగారు రాజీపడని నిర్మాత. మాటలు, ఫైట్లు, డాన్సులు.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులతో ఈ చిత్రం దరువేయిస్తుంది. ఇది మంచి చిత్రం అవుతుందని 100 శాతం నమ్ముతున్నాను. ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను శివ చెబుతున్నప్పుడు నాకు నేనే చాలాసార్లు దరువేసుకున్నాను అన్నారు.
పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ....ఈ టైటిల్ నాకు బాగా నచ్చింది. పాటలు కూడా చాలా బాగున్నాయి అని రవితేజ చెప్పాడు. ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇకనుంచి శివరామకృష్ణగారు వరుసగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు రవితేజ చేసిన అన్ని చిత్రాలకన్నా ‘దరువు’ వ్యత్యాసంగా ఉంటుంది. ఇందులో రవితేజ పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తారు’’ అని చెప్పారు. ఇంకా ఈ వేడుకలో తాప్సీ,‘వెన్నెల’ కిశోర్, చిత్రసంగీతదర్శకుడు విజయ్ ఆంటోని తదితరులు పాల్గొన్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment