ఓ పాట కోసం ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఆ పాట తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ పాట తమ హీరోకే వస్తుందని..ఇరు పక్షాల హీరోల అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఆ పాట మరేదో కాదు...అమెరికాకి చెందిన పాప్ గాయకుకుడు అకాన్ తెలుగులో తొలిసారి పాడబోతున్న పాట. తమన్..ప్రస్తుతం అకానే ని కలిసి తన సంగీతం లో పాటకు ఒప్పించుకున్నాడు. ఆ పాట ఓ రేంజి పాట అవుతుందని భావిస్తున్నారు. అయితే ఏ హీరో కోసం ఆ పాటను చేస్తున్నాననే విషయం తమన్ చెప్పటం లేదు. అయితే ప్రస్తుతం తమన్ తెలుగులో ఎన్టీఆర్,రామ్ చరణ్,వెంకటేష్ చిత్రాలకు అందిస్తున్నాడు.
ఆ మధ్యన వచ్చిన షారూఖ్ హిందీ సినిమా 'రా.వన్'లో 'ఛమక్ ఛల్లో..' పాట పాడింది అకానే. యూత్ ని ఆ పాట ఊపేసింది. ఎంతలా ఆ పాట జనాల్లోకి వెళ్లిపోయిందంటే... 'ఛమక్ ఛల్లో..' అనే టైటిల్ తో తెలుగులో ఓ చిత్రం కూడా తయారవుతోంది. నీలకంఠ,వరుణ్ సందేశ్ కాంబినేషన్ లో రూరొందే చిత్రానికి ఆ టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఆ క్రమంలోనే అకాన్ చేత తెలుగు పాట పాడించాలని తమన్ భావిస్తున్నారు.
ఈ వివరాల్ని మీడియాకి తమన్ చెబుతూ ...యవ శ్రోతలు వైవిధ్యమైన పాటల్ని ఆదరిస్తున్నారు. పైగా తెలుగు సినిమా విదేశాల్లోనూ ఆదరణ పొందుతోంది. అమెరికాలో ఉన్న మన తెలుగు యువతను మెప్పించాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాలి. 'ఛమక్ ఛల్లో'తో మనవాళ్లకీ అకాన్ గొంతు నచ్చింది. అందుకే ఆయనతో సంప్రదింపులు మొదలుపెట్టాం. కొద్ది రోజుల్లో మా ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి అన్నారు.
అలాగే నేను ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్, వెంకటేష్ చిత్రాలు చేస్తున్నాను. ఈ మూడింటిలో ఒక చిత్రంలో అకాన్ పాట ఉంటుంది అన్నారు. మరి అమెరికన్ పాప్ సింగర్ చేత తెలుగు భాష ఎలా పలికింపజేస్తారు? అంటే... ''హిందీలో ఇప్పటికే విదేశీ గాయకులు తమ గొంతు వినిపిస్తున్నారు. మన తెలుగు పదాల్ని జాగ్రత్తగా పలికింపజేసుకొంటూనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి'' అన్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న బాద్షా,మెహర్ రమేష్..వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న షాడో,రామ్ చరణ్..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఎవడు చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment