Home »
Telugu-Version
» శ్రీదేవి ఆంటీ.. కోటిన్నర కాదు... కాస్త తగ్గించుకోండి.. మంచు విష్ణు
శ్రీదేవి ఆంటీ.. కోటిన్నర కాదు... కాస్త తగ్గించుకోండి.. మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా ఓ పౌరాణిక నేపధ్యం ఉన్న చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రావణుడిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడు. ఆయన సరసన మండోదరిగా నటించేందుకు శ్రీదేవిని అడిగాడట మోహన్ బాబు కుమారుడు విష్ణు. ఐతే విష్ణు అభ్యర్థనను విన్న శ్రీదేవి తనకు కోటిన్నర రూపాయలు పారితోషికం ఇస్తే నటించేందుకు తాను రెడీ అని చెప్పిందట. అది కూడా కేవలం 45 రోజుల కాల్షీట్లకేనట. దీంతో మంచు విష్ణు దిమ్మెరపోయాడట. కానీ ఎలాగైనా శ్రీదేవిని టాలీవుడ్‌లో మరోసారి తమ చిత్రం ద్వారానే పరిచయం చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట. అందుకనే శ్రీదేవి ఆంటీని రేటు విషయంలో బతిమాలుతున్నాడట. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా శ్రీదేవి ఆంటీ మరీ ఇంత బెట్టు చేయడంపై కొద్దిగా ఇదైన విష్ణు మాధురీ దీక్షిత్ వైపు కూడా ఓ లుక్కేస్తున్నాడట.
Post a Comment