‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లోని పాపులర్ సాంగ్ ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ..’మర్చిపోని వారు ఉండరు. ఇప్పుడా పాట రీమిక్స్ చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అదీ రామ్ చరణ్ తదుపరి చిత్రంలో అని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘ఎవడు’ చిత్రం కోసం ఈ రీమిక్స్ ని రెడీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఆ మధ్యన మొదలైన ఈ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ నెల 27నుంచి మొదలవుతోంది.
ఇక రామ్ చరణ్ .. మగధీరుడులో బంగారు కోడి పెట్ట సాంగ్ ని రీమిక్స్ చేసారు. చిరంజీవి కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన ఘరానామొగుడులోని ఆ పాటలో చిరంజీవి కూడా కొద్ది క్షణాలు కనిపించి మురిపించారు. మగధీర చిత్రం కూడా సూపర్ హిట్ అవటమే కాక ఆ పాట కూడా మెగా హిట్ అయ్యింది. ఆ తర్వాత మొన్న రిలీజైన రచ్చ చిత్రంలో వాన...వాన వెల్లువాయే అంటూ మరో పాటను రీమిక్స్ చేసారు. గ్యాంగ్ లీడర్ లోని ఆ పాట ఈ తరాన్ని కూడా ఉర్రూతలూగించిపారేసింది. దాంతో ఇప్పుడు ఈ పాటను రీమిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఈనెల 27 నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తారు. 'జంజీర్' సినిమా షూటింగ్ బిజీలో ఉన్న చరణ్, 30వ తేదీ నుంచి 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఆరోజు నుంచి సమంతా,రామ్ చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. ‘మద్రాసు పట్టణం’ అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా’ అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment