బాలీవుడ్‌లో ఇప్పుడు అత్యంత ఖరీదైన తారామణి ఎవరయ్యా అంటే.. ప్రియాంకా చోప్రా అని చెపుతున్నారు. దీనికి కారణం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ బాలీవుడ్ ఎంట్రీ. 1973లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన 'జంజీర్' చిత్రాన్ని రీమేక్ చేస్తూ రామ్ చరణ్ హీరోగా చిత్రీకరించబోతున్నారు. 'చిరుత'.. 'మగధీర'.. తాజాగా 'రచ్చ'తో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రామ్ చరణ్ బాలీవుడ్‌లోనూ తన ఎంట్రీతోనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు మరల్చుకుంటున్నాడు.
'జంజీర్' చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం చాలానే కసరత్తు జరిగింది. చివరికి రామ్ చరణ్ ప్రపంచసుందరి 2000 ప్రియాంకా చోప్రాకు ఓటు వేశాడు. అంతేకాదు.. ఇప్పటివరకూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికీ ఇవ్వనంత పారితోషికాన్ని నిర్మాతల చేత ఇప్పించేట్లు చేశాడంటున్నారు. ప్రియాంకా చోప్రాకు ఈ చిత్రంలో నటించేందుకుగాను 9 కోట్ల రూపాయలను పారితోషికాన్ని ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్ టాప్ తారామణులుగా ఉన్న కత్రినా, కరీనా, దీపికా పదుకునే, ఐశ్వర్యారాయ్ రికార్డులన్నిటినీ అధిగమించి ప్రియాంకా దూసుకు వెళుతోంది.
ఐశ్వర్యారాయ్ రజినీకాంత్ 'రోబో' చిత్రంలో నటించినందుకుగాను రూ. 5.5 కోట్లు తీసుకున్నట్టు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇక దీపికా పదుకునే, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్ వంటి తారలు పరిస్థితిని బట్టి రూ.4 నుంచి రూ.5 కోట్ల మధ్య పారితోషికాన్ని పుచ్చుకున్నారు. తాజాగా ప్రియాంకా చోప్రా ఈ రికార్డులన్నింటినీ అధిగమించి 9 కోట్ల పారితోషికాన్ని 'జంజీర్' చిత్రం కోసం తీసుకుంటోంది.
ప్రియాంకా చోప్రా పారితోషికాన్ని బట్టే రామ్ చరణ్ తేజ 'జంజీర్' చిత్రం స్టామినా ఏంటో తెలుస్తోందంటున్నారు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు. మొత్తానికి బాలీవుడ్‌లో ప్రస్తుతం కాస్ట్‌లీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అయితే... అత్యంత ఖరీదైన ఇండియన్ నటుడు రామ్ చరణ్ కాబోతున్నాడా...?!!!

Share with Friends : |
Share with Friends : |
Post a Comment