దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ తన హృదయాన్ని గాయపరిచాడని ఐటెమ్ గాళ్ రాఖీ సావంత్ తెగ బాధపడిపోతోంది. ధనుష్ అంతగా రాఖీని బాధించిన సంఘటన ఏంటయా.. అంటే, ధనుష్ చిత్రం '3' ప్రమోషన్‌లో భాగంగా కొలవెరి పాటకు స్టేజిపై డ్యాన్స్ చేయాలని అనుకున్నారట.
కొలవెరి పాటకు ఆడి పాడేందుకు ధనుష్ సిద్ధమైపోయాడట. ధనుష్ సరసన స్టేజిపై చిందులేసేందుకు రాఖీ సావంత్ పొదుపైన వస్త్రాలతో వయ్యారంగా వచ్చిందట. ఆమెను చూసిన ధనుష్, నాతో డ్యాన్స్ చేసేది.. ఈమా... అంటూ మరో మాట మాట్లాడకుండా అక్కడ్నించి గిరుక్కున వెనక్కి తిరిగాడట.
అతనలా ఎందుకు వెళుతున్నాడని వాకబు చేస్తే.. వివాదాస్పద స్టార్, ఐటెమ్ గాళ్‌తోనా డ్యాన్స్ చేసేది.. నో.. నో అన్నాడట. అంతలో రాఖీ సావంత్ డ్యాన్స్ చేసేందుకు ధనుష్ దగ్గరికి వచ్చేసి... చేద్దామా... అందట. ఆమె తనను ఎక్కడ తాకుతుందో అన్నట్లుగా ధనుష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఈ విషయమే తనను ఎంతో బాధించిందని రాఖీ తెగ వగరుస్తూ చెపుతోందట.
రజినీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఆయన తన డ్రీమ్ మ్యాన్ అనీ చెపుతూ.. అటువంటి యాక్టర్‌కు అల్లుడుగా ధనుష్ ప్రవర్తన చూసి విస్తుపోయానని అంటోదట. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, షారుక్ వంటి తారలు తన పట్ల చూపే ఆదరణను చూసినప్పుడు బాలీవుడ్ గ్రేట్ అనిపిస్తోందని కనబడినవారికల్లా తెగ చెపుతోందట. ఐతే ఇప్పటికీ ధనుష్ అంటే తనకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయనీ, అతని కొలవెరి పాటకు తను వెర్రి అభిమానినని అంటోందట.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment