సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త చిత్రం ఏప్రిల్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దూకుడు వంటి హిట్ చిత్రాన్ని అందించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది.
మరోసారి అందాల తార కాజల్ ప్రిన్స్ సరసన రొమాన్స్ చేయబోతుంది. బిజినెస్ మేన్ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ అదరహో అనిపించుకుంది కూడా. ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చేయ్యాలని చిత్ర నిర్మాతలు యోచిస్తున్నారు. ప్రిన్స్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో బిజీగా ఉన్నాడు. కాజల్ కూడా ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో బిజీ బిజీగా ఉంది.
Post a Comment