సైఫ్ అలీఖాన్‌తో తన సుదీర్ఘ కాల డేటింగ్‌కు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ముగింపు పలికేయాలనే కరీనా కపూర్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఎప్పుడు కుదిరితే అప్పుడు మెడలో మూడుముళ్లు వేయించుకుంటానని చెపుతోందట.
అయితే, బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ జీరో సైజు సుందరి వాలకం చూస్తోంటే అప్పటి దాకా వేచి చూసే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని అంటున్నాయి. ఈ సంవత్సరాంతంలో కాకుండా, ఏకంగా, వచ్చే నెలలోనే సైఫ్‌తో వివాహ బంధాన్ని ఏర్పాటు చేసేసుకోవాలని తొందరపడుతోందని అంటున్నాయి. సైఫ్ ప్రస్తుతం తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న 'ఏజెంట్ వినోద్' సినిమాతో బిజీగా ఉన్నాడు.
కరీనా కూడా మధుర్ భండార్కర్ రూపొందిస్తున్న 'హీరోయిన్' అనే సినిమా షూటింగ్‌లో ఉంది. చాలాకాలం నుండి ఎక్కడ చూసినా సైఫ్‌తో దర్శనమిస్తూ వస్తున్న కరీనా మొన్నటి వరకూ పెళ్లికి అంత తొందరపడినట్లు అనిపించలేదు. అయితే, బార్లలో తాగి తందానాలాడుతూ, కనిపించిన వాళ్లందరిపై చేతులు ఝళిపిస్తూ కేసుల్లో ఇరుక్కుని పోలీసుస్టేషన్లకు వెళ్తున్న సైఫ్ గురించి ఈమధ్య పలు విమర్శలు రావడం ఎక్కువయింది.
సైఫ్‌తోపాటూ కరీనా కూడా తగుదునమ్మా అంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లిరావడం చూసిన స్నేహితులు, బంధువులు కూడా కరీనా ముఖం మీదే చెడామడా వాయించేయడం కూడా ఎక్కువయింది. వీటన్నింటినీ చూస్తున్న కరీనాలో ఎట్టకేలకు మార్పు వచ్చిందని, ఇక వేచి చూస్తే లాభం లేదని, ఒకవేళ జరగరానిదేమయినా జరిగి, వివాహానికి ముందే తమ బంధానికి ముగింపు పలికేయాల్సి వస్తే నష్టపోతానని గ్రహించిందని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
సైఫ్ నిర్మిస్తున్న ఏజెంట్ వినోద్ సినిమా కూడా ఈ నెలలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాగానే, తాళి కట్టించేసుకునేలా మంచి పట్టుదలతోనే ఈ అమ్మడు ఉంది. అయితే, పైకి మాత్రం ఇప్పుడే అంత తొందరలేదు.. ఈ ఏడాది ఆఖరు వరకు ఆగుతామని బింకంగా చెబుతోంది. కాగా, సైఫ్‌తో కరీనా తన ప్రేమాయణాన్ని 2007 నుండి కొనసాగిస్తూ వస్తోంది.

Post a Comment