మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, జ్యోతిక, శ్రియ, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషించారు. దేశంలో రోజు రోజుకు పెరిగి పోతున్న అవినీతి, అంచగొండి తనాన్ని టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం అప్పట్లో భారీ సంచలనానికి తెర తీసింది.
తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని, ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా మాధుర్ బండార్కర్‌ను సంప్రదించినట్లు ముంబైకి చెందని ఓ టాబ్లాయిడ్ వెల్లడించింది. మధుర్ బండార్కర్ బాలీవుడ్‌లో చాందినీ బార్, పేజ్ 3, ఫ్యాషన్ లాంటి అద్భుతమైన చిత్రాలు రూపొందించారు.
సంజయ్ లీలా బన్సాలీ ఇప్పటికే తెలుగులో వచ్చిన విక్రమార్కుడు చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

Post a Comment