మంచు మనోజ్ హీరోగా ఇటీవల విడుదలైన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రం....తాజాగా ఈ రోజు (మార్చి 17)న మరోసారి ఫ్రెష్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ తాజా వర్షెన్‌కు ‘మిస్టర్ నూకయ్య రీలోడెడ్’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ తాజా వెర్షన్ కథనం వేగంగా సాగడంతో పాటు గ్రాఫిక్ వర్క్ మరింత పెంచారని, కొన్ని సీన్లను ఎడిట్ చేశారని, నోకియా కంపెనీ నుంచి అభ్యంతరాల నేపథ్యంలో సినిమాలో నోకియా పేరు ఎక్కడ కనిపించకుండా చేశారని తెలుస్తోంది.
సినిమా విడుదల ముందు వరకు చిత్రం పేరు మిస్టర్ నోకియాగా ప్రచారంలో ఉంది. అయితే నోనియా కంపెనీ వారు తమ పేరు వాడుకోవడంపై నోటీసులు ఇవ్వడంతో ఆ సినిమా పేరును మిస్టర్ నూకయ్యగా మార్చారు. అయినప్పటికీ ఈ సినిమాను పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో విడుదల కాకుండా చేసింది సదరు కంపెనీ. ఈ క్రమంలోనే సినిమాలో కొన్ని మార్పులు చేసి విడుదల చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
మనోజ్, కృతి కర్బంధ, సనాఖాన్, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సామ్రాట్, పరుచూరి వెంకటేశ్వరరావు, మురళిశర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : యువన్ శంకర్ రాజా, సమర్పణ : సినిమా 5.

Post a Comment