.
Home » » 'దిల్ సే' డబ్బింగ్ ప్రారంభం

'దిల్ సే' డబ్బింగ్ ప్రారంభం

Written By Hot nd spicy on Saturday, 17 March 2012 | 08:56

నిత్యామీనన్ ప్రధాన పాత్రలో మ్యూజికల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఇటీవలే మళయాలంలో విడుదలై విజయమంతమైన ఓ చిత్రం తెలుగులో దిల్ సే గా  త్వరలో ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.
 ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్ఎల్ లక్ష్మీ మాట్లాడుతూ.ఓ అమ్మాయి జీవితంలో ప్రేమ ఎలా చిగురించింది. ఐ హేట్ యు అని చెప్పిన అబ్బాయికే ఐలవ్ యు ఎందుకు చెప్పింది. వారిద్దరి మధ్య ప్రేమకు సప్తస్వరాలు ఎలా సాయపడ్డాయి. అనే వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. నిత్యామీనన్ కి జోడీకా అసిఫ్ అలి నటించిన ఈ సినిమా అవార్డు విన్నర్ మనోజ్ పిళ్ళై ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ కానుంది అని అన్నారు.  నడిముడి వేణు, లక్ష్మీ రామకృష్ణన్ ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమాకి సంగీతం : బిజిబాల్, ఫోటోగ్రఫీ : మనోజ్ పిళ్ళై, నిర్మాత: ఎమ్ ఎల్ లక్ష్మీ, దర్శకత్వం : శిబిమలయిల్.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger