.
Home » » 'పందెంకోడి-2' గురించి విశాల్

'పందెంకోడి-2' గురించి విశాల్

Written By Hot nd spicy on Thursday, 15 March 2012 | 09:44

విశాల్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం 'పందెంకోడి'. మీరాజాస్మిన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి విశాల్ వచ్చారు. ఈ విషయమై ఆయన మీడియాతో చెపుతూ...'పందెంకోడి-2' తీద్దామనుకొంటున్నాం. దానికీ లింగుస్వామి దర్శకత్వం వహిస్తారు. అంతకన్నా మంచి ఎమోషన్స్ కలిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరోసారి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయటానికి లింగు స్వామి అద్బుతమైన కథను రెడీ చేస్తున్నారు అన్నారు. ఇక ప్రస్తుతం విశాల్ హీరోగా తమిళంలో నటించిన అనువాద చిత్రం 'కిలాడి' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సంద్భంగా విశాల్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వివరించారు.

ఇక 'కిలాడి'చిత్రానికి తిరు దర్శకత్వం వహించారు. కిలాడి గురించి విశాల్ చెపుతూ..''తొలిసారి ప్లేబోయ్‌ తరహా పాత్ర పోషిస్తున్నాను. ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకొనే పాత్ర నాది. ఈతరం అబ్బాయిల మనోభావాలు ఈ పాత్రలో కనిపిస్తాయి. 'వాడు వీడు' కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది అన్నారు. అలాగే త్వరలోనే బాల దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాని విశాల్‌ చెప్పారు. 'వాడు వీడు'కి అవార్డులు రావటంపై మాట్లాడుతూ..అవార్డు కోసం ఆ సినిమాలో నటించలేదు. కేవలం బాల కోసమే ఒప్పుకొన్నా. నేను అవార్డుల మీద దృష్టి పెట్టకపోయినా నాకు పురస్కారం వస్తుందని చాలా మంది ఆశపడ్డారని చెప్పారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger