హీరోయిన్ చార్మి త్వరలో తెరపై వేశ్యగా కనిపించబోతోంది. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు ఈ సినిమాకు దర్శకుడు. బేబి హ్యాపీ సమర్పణలో డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దర్శకుడు చందు మాట్లాడుతూ...సెల్యులాయిడ్‌పై వేశ్య పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రముఖ కథానాయికలంతా ఈ పాత్రలో రాణించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సావిత్రి ‘కన్యాశుల్కం’లోనూ, జయప్రద ‘ప్రేమ మందిరం’లోనూ, జయసుధ ‘కలియుగ స్త్రీ’, ‘ప్రేమాభిషేకం’, ‘కురుక్షేత్రంలో సీత’, ‘ప్రేమ తరంగాలు’లోనూ, లక్ష్మి ‘మల్లెపువ్వు’లోనూ, శ్రీదేవి ‘మోసగాడు’లోనూ, ప్రభ ‘నేరం నాది కాదు ఆకలిది’లోనూ, టబూ ‘చాందినీబార్’లోనూ, కరీనాకపూర్ ‘చమేలీ’లోనూ, అనుష్క ‘వేదం’లోనూ ఈ తరహా పాత్రలు పోషించారు. ఆ స్థాయిలోనే ఇందులో చార్మి పాత్ర ఉంటుంది. ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నాం. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఒక వేశ్యకు, రచయితకు, సింగర్‌కు మధ్య జరిగే కథ ఇది. రచయిత, సింగర్ పాత్రలకు కొత్త తారలను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాం’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతాం ’ అన్నారు. ఈచిత్రానికి కెమెరా : ప్రవీణ బంగారి.
Home »
» వేశ్యగా మారిన చార్మి!
Post a Comment