
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలియానా హీరోయిన్‌గా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ‘హనీ’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగినా....ఆ మధ్య దర్శకుడు ఆ వార్తలను తోసి పుచ్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జులాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోలో పోస్టు ప్రొడక్షన్ వర్కు జరుపుకుంటున్న ఈచిత్రం జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని తన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టైరేజేషన్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది. మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే అల్లు అర్జున్ తాజాగా మరో పెద్ద చిత్రాన్ని ఒప్పుకున్నారు. యాక్షన్ చిత్రాల నిర్మాణంలో తనదైన శైలిగల దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత. త్రివిక్రమ్ చిత్రం పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ ఈ కొత్త చిత్రంలో నటిస్తారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో వెల్లడికానున్నాయి.
Post a Comment