.
Home » » అమ్మకానికి సూపర్ స్టార్ కారు!

అమ్మకానికి సూపర్ స్టార్ కారు!

Written By Hot nd spicy on Monday, 26 March 2012 | 10:11

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కారు టాయోటా ల్యాండ్ క్రూయిసర్‌ను అమ్మకానికి పెట్టబోతున్నాడు. 2002లో ఈ కారు ప్రమాదానికి గురై ఒక మనిషి బలితీసుకోవడంతో పాటు నలుగురిని తీవ్రంగా గాయ పరిచింది. గతంలో ప్రమాదానికి గురైన ఈ కారు అమ్మకానికి పెట్టేందుకు అనుమతి కోసం సల్మాన్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కారు తనకు అచ్చి రాక పోవడంతో పాటు బాగా పాతది కావడంతో ఆ కారును వదిలించుకోవడానికి సల్మాన్ ట్రై చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ వాడిన కారు కావడంతో చాలా మంది ఈ కారును దక్కించుకోవడానికి పోటీ పడతారనే అంచనాలున్నాయి. మరి ఈ కారును దక్కించుకునేది ఎవరో? ఎంత రేటు పలుకుతుందో కొన్ని రోజుల్లొ తేలనుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ 2 చిత్రంతోపాటు, ఏక్ థా టైగర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ తన మాజీ ప్రియురాలు కత్రినా కఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. దబాంగ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న దబాంగ్ 2 చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఈచిత్రాల తర్వాత సల్మాన్ మరో భారీ ప్రాజెక్టుకు వ్యూహ రచన చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 300 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారని, ఇందులో కమల్ హాసన్, జాకీచాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger