
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు పాత్రలో నటిస్తున్నాడు. అయితే గంగ ఎవరు? అనే విషయం మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సస్సెన్స్‌కు తెర తీశారు. ఈచిత్రంలో గంగ పాత్రలో తమన్నా నటిస్తున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమెనే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ అని స్పష్టం చేశారు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ తాజా సినిమా మీడియాలో సెన్షేషన్ సృష్టించడం ఖాయం. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటో గ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: శేఖర్, ఫైట్స్: విజయ్, నిర్మాత: డివివి దానయ్య, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Post a Comment