రామ్ చరణ్,వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీతం వహించటానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ నిమిత్తం దర్సకుడు వినాయిక్,తమన్ ఇద్దరూ కలిసి ఊటీకి వెళ్తున్నట్లు సమాచారం. అదిరిపోయే ఆడియోని తేవాలని ఇద్దరూ పిక్స్ అయ్యి రామ్ చరణ్ కి మాట ఇచ్చి మరీ ఊటికి బయిలు దేరారని తెలుస్తోంది. సిటిలో ఉంటే ఎవరో ఒకరు వస్తారు..ఏదో ఒక హడావిడి ఉంటుందని ఇలా ప్రయాణం పెట్టుకున్నట్లు చెప్తున్నారు. ఇక రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందే ఈ కొత్త చిత్రం షూటింగ్ మొన్నటివరకూ పాత బస్తీలో జరిగింది.
వారం రోజులు పాటు కంటిన్యూగా గా ఫైట్ సీన్స్ తీసారు. కణల్ కన్నన్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ బ్యానర్ పై నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు. వినోదం, యాక్షన్... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ కథలో మరో హీరోయిన్ కీ స్థానం ఉంది. ఆమె ఎవరనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.'మగధీర' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు

Post a Comment