బాలీవుడ్ హాట్ లేడీ మల్లికా షెరావత్ నటిస్తున్న ‘తేజ్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా శివసేన కార్యకర్తలు సెట్ లోకి దూసుకొచ్చి హల్ చల్ చేశారు. హిందీ సినిమా షూటింగుల్లో, ముఖ్యంగా మహారాష్ట్రలో జరుగుతున్న షూటింగుల్లో విదేశీ నటులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న శివ సైనికులు....తనిఖీలో భాగంగా ‘తేజ్’ సినిమా షూటింగ్ సెట్ లో హల్ చల్ చేశారు.
శివ సైనికులు వచ్చినపుడు ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటులు..అజయ్ దేవగన్, కంగన రనౌత్, అనిల్ కపూర్, సమీరారెడ్డి తదితరులు....ఇక్కడి షూటింగులో విదేశీ నటులు ఎవరూ లేరని సర్ది చెప్పి పంపారు. ప్రొడక్షన్ హెడ్ కూడా సినిమాలో విదేశీయులు ఎవరూ లేరని వివరణ ఇవ్వడంతో శాంతించిన శివ సైనికులు అక్కడి నుంచి నిష్ర్కమించారు.
శివసేన కార్యకర్తలు ఒక్కసారిగా సెట్ లోకి దూసుకు రావడంతో ఏం జరుగుతుందో అని అంతా ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారని, అయితే వారంత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా శాంతి యుతంగా అక్కడి నుంచి వెళ్లి పోవడంతో అంతా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారని యూనిట్ సభ్యులు తెలిపారు.

Post a Comment