యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమాకు ‘యాక్షన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ చివరకు ‘బాద్ షా’ అనే టైటిల్ ఖారారు చేశారు. తాజాగా ఈచిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. మార్చి 18 పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘దమ్ము’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Post a Comment