.
Home » » జూనియర్ ఎన్టీఆర్ "దమ్ము" చూపిస్తాడా!

జూనియర్ ఎన్టీఆర్ "దమ్ము" చూపిస్తాడా!

Written By Hot nd spicy on Friday, 17 February 2012 | 00:35

పెండ్లయిన తర్వాత సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఎన్‌.టి.ఆర్‌. తన 'దమ్ము'ను చూపిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు... అంటూ, ఈ లాజిక్కుతో ఎన్‌.టి.ఆర్‌.ను కొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

ఎన్‌.టి.ఆర్‌.కు జోడీగా త్రిష, కార్తీక నటిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు కుమారుడు అలెగ్జాండర్‌ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ మొన్నటివరకు హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో పాటల చిత్రీకరణ కోసం వెళ్ళింది. అవి ముగించుకుని వచ్చాక.. ఉగాదినాడు ఆడియోను విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం మాస్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రధానంగా వినోదానికి పెద్దపీట వేశాడు దర్శకుడు. కీరవాణి అందిస్తున్న సంగీతం రికార్డింగ్‌ స్టేజీలో ఉంది. ఆడియోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger