విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్ గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. హీరో వెంకటేష్ పై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు షూటింగులో జాయిన్ కాబోతున్నారు.
అయితే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఒకప్పటి మేటి హీరోయిన్ జయసుధ ఇందులో ప్రకాష్ రాజ్ భార్యగా నటిస్తున్నారు. ఇక వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి ఎంపికయింది. మహేష్ బాబు సరసన హాట్ హీరోయిన్ సమంత రొమాన్స్ చేయనుంది. వీరితో పాటు హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఈ చిత్రంలో వెంకీ-మహేష్ చెల్లెలు పాత్రలో కనిపించనుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అమలపాల్ కూడా నటిస్తోందని, ఈవిడ వెంకీ-మహేష్ మరదలు పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో....భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు పెద్ద హీరోలు ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు రెగ్యులర్ ఫ్యాన్స్ ను కూడా ఈ చిత్రం అలరిస్తుందని, వసూళ్ల వర్షం కురవడం ఖాయం అనే వాదన వినిపిపిస్తోంది.

Post a Comment