కళ్యాణ్ రామ్ తాజాజా ఓ త్రీడీ చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఫ్లెక్స్ హౌస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కల్యాణ్‌రామ్, కార్తీక్, సురేష్ తదితరులపై ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించే పనిలో ఉన్నామని ఆయన చెప్తున్నారు. ఇక సునీల్ రెడ్డి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ శిష్యుడు.ఆయన వద్ద భగీరధ, ఒకరికి ఒకరు చిత్రాలకు పనిచేసారు. మంచు మనోజ్ తో చేసిన నేను మీకు తెలుసా చిత్రం బాగా పేరు తెచ్చుకుంది.
నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెప్తున్నారు.ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తున్నారు. చిజిల్డ్ బాడీతో ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. అందు కోసం నిపుణులైన శిక్షకుల దగ్గర తర్ఫీదు తీసుకొంటున్నారు. ఇంతకుముందు తన భ్యానర్ లో కళ్యాణ్ రామ్ అతనొక్కడే,హరేరామ్,జయీభవ చిత్రాలు నిర్మించారు. కత్తి చిత్రం తర్వాత ఆయన మరే చిత్రం కమిట్ కాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా నిర్మాత అనీల్ సుంకర సైతం ఓ త్రీడి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment