అవినీతి, లంచగొండితనం టార్గెట్ చేస్తూ కమల్ హాసన్ హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సాగుతున్న రాజకీయాలను టార్గెట్ చేస్తూ ‘అమర్ హై’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు కమల్. ఆయన ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘‘మీరెందుకు రాజకీయాల్లోకి రాలేదు? సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే డబ్బు బాగా సంపాదించొచ్చు కదా? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. రాజకీయం అంటే డబ్బు సంపాందించే సాధనంగానే సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సమాజంలో, రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి అంశాల ఆధారంగా ‘అమర్ హై’ చిత్రం వుంటుంది. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న మోసాల్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తాం’’ అన్నారు.
ప్రస్తుతం కమల్ వంద కోట్ల వ్యయంతో ‘విశ్వరూపం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘అమర్ హై’ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రూపొందించడానికి సన్నాహాలు చేసున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.... విశ్వరూపం క్లెమాక్స్ చిత్రీకరించాల్సివుంది. ఇటీవలే న్యూయార్క్‌లో నెలరోజుల పాటు షూటింగ్ జరిపాం’ అన్నారు.
కమల్ హాసన్ సినిమా కావడంతో మరో భారతీయుడు రేంజ్ లో ‘అమర్ హై’ సినిమా ఉంటుందని ఆయన అభిమానులు, సినీ విశ్లేషకులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా అవినీతి ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.

Post a Comment