‘మీ హీరోని మాఫియా డాన్‌గా ఎందుకు చూపించారు? సమాజానికి మంచి చేసే కోణంలో, సమాజంలో మంచి ప్రవర్తన వచ్చేలా చూపించి ఉండవచ్చు కదా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు దర్శకుడు పూరి జగన్నాథ్ బక్వాస్(పనికిమాలిన) సమాధానం ఇచ్చారు. ‘‘నాకు చేతకాదు, చేతనైందే తీశా, మీకు చేతనైతే అలా సినిమా తీయండి’’ అంటూ సమాధానం ఇచ్చారు. పూరి ఇలా సమాధానం ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ రేంజ్ కి వెలుతున్న కొద్దీ పూరిలో పొగరు, గర్వం ఎక్కవ అవుతోందని మండి పడుతున్నారు. బిజినెస్ మేన్ సినిమా ‘హెక్సా ప్లాటినమ్ డిస్క్’ వేడుక సందర్బంగా పూరి జగన్నాథ్ ఈ వ్యాఖ్యాలు చేశారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు-కాజల్ జంటగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ‘బిజినెస్ మేన్’ సినిమా తెలుగు సినిమా చరిత్రలోని రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. తొలి వారం రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 60 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. విడుదల విషయంలోనూ ఈ సినిమా సంచలనం సృష్టించింది. దాదాపు 2 వేల థియేటర్లలో తొలి రోజు విడుదలైంది.
ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా, జూ ఎన్టీఆర్, నాగచైతన్యతో సినిమాతో పాటు, బిజినెస్ మేన్ ను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Post a Comment