నటవారసునిగా కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ బాబు ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను డెవలప్ చేసుకున్నారు. తొలినాళ్ళలో 'నాని' వంటి ప్రయోగాలు చేసినా.. అది సరైంది కాదని పోకిరితో ప్రేక్షకులు ఇలా కావాలని నిరూపించాడు. ఎందరో కృషి శ్రమతోపాటు మహేష్ బాబు పెర్‌ఫార్మెన్స్ తోడై ప్రస్తుతం సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు.
లేటెస్ట్‌గా ఆయన నటించిన 'బిజినెస్‌మేన్' చిత్రం ఆడియో బంపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన తన మనసులోని మాటలను క్లుప్తంగా ఆవిష్కరించారు.
మీ కెరీర్‌లో బెటర్ పెర్‌ఫార్మెన్స్ ఏ చిత్రమని భావిస్తున్నారు?
'ఖలేజా'లో బెటర్ పెర్‌ఫార్మెన్స్ చేశాను. ఆ చిత్రమంటే చాలా ఇష్టం.
అంతకుముందు సినిమాలన్నీ ఎక్కువరోజులు షూటింగ్ చేసిన మీరు.. బిజినెస్‌మేన్‌ను 70రోజుల్లో పూర్తిచేయడానికి ప్రత్యేక కారణం..?
ఎక్కువరోజులు షూటింగ్ అని వచ్చే బ్యాడ్‌నేమ్‌ను తుడిచేద్దామని పక్కా స్క్రిప్ట్‌తో పూరీ వచ్చాడు. తను అనుకున్నట్లు తీయగలిగాడు.
భవిష్యత్‌లో ఇలాగే తక్కువరోజుల్లో చేసేస్తారా?
తప్పకుండా... అలా అయితేనే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయగలం. తెలుగు సినిమాలో కొత్త ఒరవడికి పూరీ నాంది పలికారు.
కామెడీ కూడా మీరే చేసేస్తే....మరి కామెడీ ఆర్టిస్టుల పని?
వారికేం ఢోకాలేదు.. అసలు మాకంటే వారే ఎక్కువ చిత్రాలు చేసేస్తున్నారు.
సంగీత దర్శకుడిని మీరు ప్రెజర్ చేశారా?
అవును. ఆయన మంచి ట్యూన్స్ ఇస్తాడని చెప్పాను. ఆయనెవరో కాదు... ఘంటసాల బలరామయ్యగారి మనవడు.
'దూకుడు'కు ముందుకు ప్లాప్‌ను, తర్వాత హిట్స్ ఏ విధంగా విశ్లేషిస్తారు?
దూకుడు ముందు అంతా సాడ్ పొజిషన్‌లో ఉన్నాను. నాకు తెలిసి.. సెప్టెంబర్ నుంచి ఏం జరుగుతుందో నాకే తెలియడంలేదు. ఇంకా డ్రీమ్‌గానే ఉంది.
నన్ను 'ఉంచుకోండి..' వంటి కొన్ని సంభాషణలు పలికేటప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా?
దర్శకుడు చెప్పింది చేశాను. అలా ఆలోచించి వుంటే.. ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేదికాదు. యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారు కాజువల్‌గా మాట్లాడే మాటలే సినిమాలో ఉన్నాయి.
మనిషికి గోల్ ఉండాలి. గోల్ లేనివాడు చచ్చిపోవాలి. అన్నారు? ఇలాంటి నీతులు ఎంతవరకు కరెక్ట్ అని చెబుతారు?
గోల్ అనేది మారిపోతుంటుంది. అక్కడ నీతులు కంటే... నిజాలు చెప్పామని చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు.
బిజినెస్‌మేన్-2 చేస్తానని పూరీ అంటున్నారు?
పార్ట్-2 చేయాలని నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. చాలా ఆతృతగానూ ఉంది.
కథ విన్నారా?
బిజినెస్‌మేన్ కథే వినలేదు. షూటింగ్ అయిన 15రోజులకు కథ చెప్పారు. అంతా ఆయనకే వదిలేశాను.
సూర్యభాయ్ (బిజినెస్‌మేన్‌లో హీరోపేరు)ను పట్టుకోవడానికి కృష్ణమనోహర్ ఐపీఎస్ (పోకిరిలో పాత్ర) సీక్వెల్‌లో వస్తాడా?
అది దర్శకుడినే అడగాలి. ఎందుకంటే... ఆ కథ కూడా నేను అడగను. ఆయన చెప్పాలనుకుంటేనే చెబుతారు.
సక్సెస్‌కు కారణం ఏమనుకుంటున్నారు?
సంభాషణలు, వైవిధ్యమైన పాత్ర చిత్రీకరణ.
హీరో పాత్ర చెడును సమర్థిస్తుంది కదా?
ఇదిఫ్యామిలీ చిత్రమని మేం ఎప్పుడూ చెప్పలేదు. మాఫియా అని ముందే చెప్పాం.
ఈ సినిమాలో మీ లుక్ ఒకేలా మెయిన్‌టైన్ చేశారని దాసరి అభినందించారు. అది ఎలా సాధ్యమైంది?
ఆ క్రెడింట్ అంతా జగన్‌దే. ఆయన చెప్పినట్లు చేశానంతే.
కొన్ని సన్నివేశాల వల్ల హిందూ మత మనోభావాలను దెబ్బతిన్నాయని భజరంగ్‌ధళ్ అంటోంది. దీనిపై మీ స్పందన?
అలాంటిది జరిగిందని మాకు తెలియదు. జగన్‌గారు అన్నట్లు... మేమంతా హిందువులమే కదా...
మాఫియా అంతటిని బిజినెస్‌గా మార్చే ఆలోచన వల్ల కొత్తగా ఉందని వారికి సూచించినట్లుగా ఉంది. వారి నుంచి ఫోన్లు వచ్చాయా?
అలాంటిది ఏమీలేదు. రాలేదు. అది సినిమా మాత్రమే.
సినిమాలో నిజాలు చెప్పిన మీరు యువత రాజకీయాల్లోకి రమ్మంటే వస్తారా?
రాజకీయాలు.. మా అబ్బాయికి ఎంత తెలుసో... నాకు అంతే తెలుసు.
చివరగా... కాజల్‌తో లిప్‌కిస్ ఆలోచన ఎవరిది?
నేను ఏది చేసినా ఆ క్రెడిట్ దర్శకునిదే. ఆ సీన్ ఉందని నిర్మాతకు తెలుసు.. చెప్పేవరకూ నాకు తెలీదు అన్నారు మహేష్.

Post a Comment