హైదరాబాద్: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ 'శ్రీమన్నారాయణ' పాటల విడుదల వేడుకకి హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపై అందరిలో ఆసక్తి రేగింది. ముఖ్యంగా ఏ డైరక్టర్ చేతిలో తన కుమారుడుని బాలకృష్ణ పెట్టడానికి ఫిక్స్ అయ్యారు అనే చర్చలు మొదలయ్యాయి. దానికి సమాధానంగా బోయపాటి శ్రీను ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పంక్షన్ లో కూడా బాలకృష్ణ కు ఓ ప్రక్క ఆయన కుమారుడు మరో ప్రక్క బోయపాటి శ్రీను కూర్చుని అందరి దృష్టిలో పడ్డారు.బోయపాటి శ్రీను ..వరస ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణతో సింహా చిత్రం హిట్ ఇచ్చారు.
ఇక 'శ్రీమన్నారాయణ'ఆడియో వేదికపైకి మోక్షజ్ఞ ని తీసుకురావాలని నందమూరి అభిమానులు నినదించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ''అభిమానుల ఆదరణే మాకు శ్రీరామరక్ష. వారు నా నుంచి ఆశించేదేమిటో తెలుసు. వారి కోరికలను నెరవేరుస్తాను'' అన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ తెరంగ్రేటం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న జరిగిన శ్రీమన్నారాయణ ఆడియో వేడుకలో ఈ విషయమై క్లారిటీ వచ్చింది. మోక్షజ్ఞ సినీ రంగ ఎంట్రీని ఖరారు చేస్తూ బాలయ్య తన కుమారున్ని వెంట తీసుకొచ్చారు. మరో వైపు యాంకర్ ఉదయభాను కూడా ఈ విషయాన్ని సభా ముఖంగా ప్రకటించింది.
గతంలో బాలకృష్ణ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...2014లో తన రాజకీయ ఆరంగేట్రం.. మరో రెండేళ్లకు తన కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటాయని బాలకృష్ణ ప్రకటించారు. ఇది బాలకృష్ణ అభిమానులను కేరింతలు కొట్టేలా చేసింది. అలాగే... వాడిని హీరోగా చేయాలని అబిమానులంతా కోరుకుంటున్నారు. నాక్కూడా అలాగే ఉంది. అయితే అందుకు నాలుగైదేళ్ళు సమయం ఉంది. మా వాడికిప్పుడు పదిహేనేళ్ళు. పదో తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్ లోకి వెళ్థున్నాడు అంటూ బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞని ఎప్పుడు హీరోగా పరిచయం చేయబోతున్నారనే విషయం స్పష్టంగా మీడియాకు తెలియచేసారు.
అలాగే ఆయన మాటల్లోనే...మోక్షజ్ఞకు కూడా నటన మీద పూర్తి ఆసక్తి ఉన్నట్లే కనపడుతోంది. అయితే వాడు ముందు చదువు పూర్తి చేయాలి. అప్పుడప్పుడు నాన్నగారి సినిమాలు చూపిస్తూ వాడికి ప్రపంచం గురించి చెబుతున్నాను. నా గురించి కన్నా వాళ్ళ తాత గారి గురించే ఎక్కువ చెబుతూంటాను. మా ఆకాంక్షలు వాడు నిజం చేస్తే నాకన్నా గర్వపడే, ఆనందపడే వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు అన్నారు బాలకృష్ణ. బాలయ్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం 2014లో మోక్షజ్ఞ నటించబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంతకంటే ముందుగా మోక్షజ్ఞను లండన్ పంపించి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట బాలయ్య.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment